AP Cm Chandra Babu Serious Comments On Telangana Govt | Oneindia Telugu

2019-03-07 231

AP Cm Chandra Babu serious comments on Telangana Govt. Babu says Telangana Govt threatening AP business people in Hyderabad. Modi and Kcr helping Jagan in elections. Cm saying Telangana Police stolen TDP data and given to YCP.
#APCmChandraBabu
#YSJagan
#KCR
#KTR
#Narendramodi
#ITgridIssue
#TelanganaGovt
#TDP
#YCP


తెలంగాణ ప్ర‌భుత్వం పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌లన వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌ధాని మోదీ..తెలంగాణ సీయం కేసీఆర్..వైసిపి అధినేత జ‌గ‌న్ ముగ్గూరు క‌లిసి ఏపి పై దాడి చేస్తున్న‌ర‌న్నారు. ప్ర‌శ్నించే వారి పై ఐటి దాడులు చేయి స్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ‌లోని ఏపి పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని..దాడులు చేసి భ‌య పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. వాళ్ల అరాచ‌కాలు త‌మ పై ప‌ని చేయ‌వ‌ని చెప్పుకొచ్చారు. దాడుల తో మాన‌సిక క్షోభ‌కు గురి చేస్తున్నార‌న్నారు. కార్పోరేట్ వ్య‌క్తుల‌ను భ‌య‌పెడుతున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ ప్ర‌భుత్వానిది ఆర్దిక ఉగ్ర వాద‌మ‌ని తీవ్ర ఆరోప‌ణ చేసారు. తెలంగాణ లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏం చేసారు..ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలుస‌ని.. ఆ ప‌రిస్థితే ఇప్పుడు ఏపి లో చేయాల‌ని చూస్తున్నారా అని సీయం ప్ర‌శ్నించారు.